మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేయాలి: కొత్తగూడెం కలెక్టర్

Kothagudem.. Work for development of municipalities, junior assistants told. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని

By అంజి  Published on  3 Nov 2022 2:31 PM GMT
మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేయాలి: కొత్తగూడెం కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన వీఆర్వోలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల జూనియర్ అసిస్టెంట్లకు మున్సిపల్ చట్టాలు, విధులపై నిర్వహించిన ఒకరోజు అవగాహన కమ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కొత్తగూడెం జిల్లాలోని మున్సిపల్‌ కార్యాలయాల్లో 38 మంది గ్రామ రెవెన్యూ అధికారులు ( వీఆర్‌వోలు ) జూనియర్‌ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రజాసేవలు అందించడంలో కీలకమైన మున్సిపల్ శాఖలో భాగమైనందుకు వీఆర్వోలను అభినందించారు.

రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్ సేవలను పొందే ప్రక్రియను సులభతరం చేసిందని, ప్రజలకు సేవలను అందించడంలో జూనియర్ అసిస్టెంట్లు ప్రభుత్వ మార్గదర్శకాలకు సంబంధించి తమను తాము అప్‌డేట్ చేసుకోవాలని కలెక్టర్ దురిశెట్టి సూచించారు. రెవెన్యూ శాఖలో వీఆర్‌వోల సేవలు అభినందనీయమని, మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ల మాదిరిగానే వారు కూడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు గడిచిన మూడేళ్లలో మంచి ప్రగతిని సాధించి స్వచ్ఛ మున్సిపాలిటీలుగా మారాయి .

అనంతరం జిల్లా వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు అందజేయాలని వైద్యారోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. మణుగూరు, అశ్వారావుపేట ఆసుపత్రుల్లో గర్భిణులకు ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, బర్త్‌ వెయిటింగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని దురిశెట్టి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, గర్భిణులకు శారీరక వ్యాయామ పరికరాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గోడలపై పెయింటింగ్స్‌, ప్లేయింగ్‌ కిట్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలన్నారు.

Next Story