మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన కొత్తగూడెం ఎస్పీ.. వీడియో

తాజాగా ఓ పోలీసు అధికారి.. మాస్ సాంగ్‌కు తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. తన డ్యాన్స్‌తో తోటి పోలీస్ అధికారులను ఉర్రూతలూగించారు.

By అంజి  Published on  20 May 2024 2:18 PM IST
Kothagudem, Sp Rohit Raj, Viralnews, Telangana

మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన కొత్తగూడెం ఎస్పీ.. వీడియో

తాజాగా ఓ పోలీసు అధికారి.. మాస్ సాంగ్‌కు తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. తన డ్యాన్స్‌తో తోటి పోలీస్ అధికారులను ఉర్రూతలూగించారు. దీంతో ఆయనతోపాటు వారు కూడా కాలు కదిపారు. ఇంతకీ మాస్‌ బీట్‌కి స్టెప్పులేసిన ఆ అధికారి ఎవరో తెలుసా?.. కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్. ఓ ఫంక్షన్ హాల్ సమావేశమైన ఆయన తోటి అధికారులతోపాటు డ్యాన్స్ చేసి అలరించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా ముగియగా, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ జిల్లాల్లో ఎన్నికల బందోబస్తును సక్సెస్ ఫుల్‌గా నిర్వహించినందుకు ఎస్పీ రోహిత్ రాజ్ గెట్ టూ గెదర్ పార్టీ ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లో పోలీసులు ప్రైవేట్‌ పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలిస్ అధికారులతో కలిసి ఎస్పీ రోహిత్ రాజ్ సరదాగా డ్యాన్స్ చేశారు. మ్యాడ్ మూవీలోని కళ్లజోడు కాలేజీ పాప పాటకు అదిరే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా గతంలోనూ ఎస్పీ రోహిత్ రాజ్ తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. కాలేజీ రోజుల నుంచే ఆయన మంచి డ్యాన్సర్. గతంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Next Story