10 కోట్లకు సీటు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి అంటూ ఆరోపణలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రచ్చ మొదలైంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే

By Medi Samrat
Published on : 27 Sept 2023 4:30 PM IST

10 కోట్లకు సీటు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి అంటూ ఆరోపణలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రచ్చ మొదలైంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందు ఉండగా.. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని.. కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి నుంచి రూ.10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని ఆయన ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు కూడా చెప్పారని, సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బయట పెడతానని మనోహర్ రెడ్డిఅన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కొత్త మనోహర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం నలుగురు అభ్యర్థులు గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆశావహుల్లో డీసీసీ చీఫ్‌ చల్లా నర్సింహరెడ్డితో పాటు కొత్త మనోహర్‌ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్మేటి అమరేందర్ రెడ్డి, బడంగ్‌పేట మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి ఉన్నారు.

Next Story