బీజేపీకి బిగ్ షాక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది.
By Medi Samrat Published on 22 Aug 2023 3:15 PM GMTభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అమిత్ షా సభకు ముందు పార్టీతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు సత్యనారాయణ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని.. సంక్షేమ పథకాలు బాగున్నాయని కోనేరు సత్యనారాయణ తెలిపారు. అందుకే బీఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటున్నానని, ఈ నెలాఖరులో పార్టీలో చేరతానన్నారు. కొత్తగూడెంలో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు.
బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం కోనేరు సత్యనారాయణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలను కలిశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వర రావును గెలిపించుకోవడానికి కృషి చేయాలని కోనేరు సత్యానారాయణకు సీఎం కేసీఆర్ సూచనలు చేశారు. ఖమ్మం జిల్లా బీజేపీలో ఉన్న వర్గవిభేదాల కారణంగానే ఆయన బయటికి వచ్చారని తెలుస్తోంది. హోం మంత్రి అమిత్ షా పాల్గొనే ఖమ్మం సభలో బీజేపీలోకి చాలా మంది చేరుతారని భావిస్తూ ఉండగా.. ఇంతలో సత్యనారాయణ పార్టీని వీడారు.