రాజీనామా చేస్తామంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkatreddy Comments On Rahul Gandhi Disqualification. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాహుల్ గాంధీ సస్పెన్షన్ పై స్పందించారు.

By Medi Samrat  Published on  26 March 2023 7:00 PM IST
రాజీనామా చేస్తామంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాహుల్ గాంధీ సస్పెన్షన్ పై స్పందించారు. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించి రాహుల్ గొంతునొక్కారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే రాహుల్ పై అనర్హత వేటు వేశారని కోమటిరెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని అన్నారు. సోనియా గాంధీ, ఖర్గే ఆదేశిస్తే తామంతా పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ సభ్యులమంతా ఒకే మాటపై ఉంటామన్నారు. రాహుల్​పై అనర్హత వేటుకు సంఘీభావంగా మార్చి 26న గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టారు.

హైదరాబాద్ లోని​ గాంధీభవన్​లోని గాంధీవిగ్రహం ముందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాంగ్రెస్ పార్టీ దీక్షకు పూనుకుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని రేవంత్ రెడ్డి అన్నారు. పదే పదే తనకు కుటుంబం లేదని చెప్పి మోదీ దేశాన్ని నమ్మిస్తున్నారని రేవంత్ అన్నారు. దేశ సంపదను మోదీ తన స్నేహితులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని రాహుల్ గాంధీ తేల్చారని.. అదానీ ఇష్యూపై లోక్ సభలో మోదీని రాహుల్ నిలదీస్తే ఇప్పటివరకు సమాధానం లేదన్నారు.


Next Story