ఏడేళ్లు అవుతున్న నిధులు ఇవ్వడం లేదు.. ఆ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాలి

KomatiReddy Venkatreddy About Pending Projects. న‌ల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని

By Medi Samrat  Published on  6 July 2021 9:34 AM GMT
ఏడేళ్లు అవుతున్న నిధులు ఇవ్వడం లేదు.. ఆ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాలి

ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ ప్రిన్సిపల్ సెక్రెట‌రీ ర‌జ‌త్ కుమార్‌, ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్‌తో బీఆర్‌కె భ‌వ‌న్‌లో గంట పాటు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా న‌ల్గొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బ్ర‌హ్మ‌ణ వెల్లంల‌, కృష్ణా న‌ది వ్య‌వ‌హారం, ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ పెండింగ్ ప్రాజెక్టు ప‌నులపై చ‌ర్చించారు. బ్ర‌హ్మ‌ణ వెల్లంల ప్రాజెక్టు ప‌నులు 90శాతం పూర్తై.. రూ. 100 కోట్లు కేటాయిస్తే ప‌నులు పూర్త‌యి అందుబాటులోకి వ‌చ్చి ల‌క్ష‌ల‌ ఎక‌రాలకు సాగు నీరు అందుతుంద‌ని వివ‌రించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడేళ్లు అవుతున్న ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండ‌లేద‌ని తెలిపారు.


అలాగే కాంగ్రెస్ హ‌యంలో ప‌దేళ్ల క్రితం 70శాతం ప‌నులు పూర్త‌యిన శ్రీశైలం ఎడ‌మ కాలువ సొరంగం ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని కోరారు. ఎప్పుడో నాలుగు ఏళ్ల క్రితం అందుబాటులోకి వ‌చ్చేద‌ని వివ‌రించారు. ప్రభుత్వం నిధులు కేటాయించ‌క పోవ‌డంతోనే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని తెలిపారు. దీనికి నీటి పారుద‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ ర‌జ‌త్ కుమార్ సానుకూలంగా స్పందించారు. విష‌యాలను సీఎం దృష్టికి తీసుకుకెళ్లి మిగిలిన‌ ప్రాజెక్టు ప‌నులు డిసెంబ‌ర్ నాటికీ పూర్తిచేస్తామ‌ని హామీ ఇచ్చారని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అన్నారు.


Next Story