నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆ వార్త‌లు న‌మ్మ‌కండి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy responds on fake news. నేను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని.. అస్వస్థత వార్తలన్నీ అవాస్తవమ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్

By Medi Samrat  Published on  4 July 2023 4:20 PM IST
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆ వార్త‌లు న‌మ్మ‌కండి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నేను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని.. అస్వస్థత వార్తలన్నీ అవాస్తవమ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నా ఆరోగ్యంపై ఓ ఛానల్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని.. నేను అస్వస్థతకు గురయ్యానని వస్తున్న వార్తలు అవాస్తవం అని ఖండించారు. తాను హైదరాబాద్ లోని నివాసంలోనే ఉన్నాన‌ని.. నాకు ఎలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్ రాలేదని వెల్ల‌డించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఊరుకోనని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు.

కాసేపటి క్రితమే నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన చెల్లబోయిన ఉపేందర్ కుటుంబాన్ని కలిశాను. ఉపేందర్ కొద్ది రోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో చనిపోయాడు. ఇవాళ ఉపేందర్ భార్య, పిల్లలను హైదరాబాద్ లోని నా నివాసంలో కలిసి.. 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేశానని వెల్ల‌డించారు. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనపడవద్దని.. నాకు అస్వస్థత అంటూ వస్తున్న ఫేక్ న్యూస్ ని నమ్మవద్దని అన్నారు.

కొన్ని ఛానల్స్ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా వార్తలు ఇస్తున్నాయి. ఇప్పటికే బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశాం. తగిన చర్యలు తీసుకోవాలని కోరాం. తప్పుడు వార్త ప్రసారం చేసినందుకు సంబంధిత ఛాన‌ల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని కోరిన‌ట్లు తెలిపారు. రేటింగ్స్ కోసం ఫేక్ న్యూస్ లు ఇస్తూ జనాన్ని ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదని సూచించారు.


Next Story