కేసీఆర్ తర్వాత కేటీఆరే.. నువ్వు కాదు.. హరీశ్ రావుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంట‌ర్‌

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది.

By Medi Samrat  Published on  20 Dec 2023 11:41 AM GMT
కేసీఆర్ తర్వాత కేటీఆరే.. నువ్వు కాదు.. హరీశ్ రావుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంట‌ర్‌

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. శ్వేతపత్రంలో లెక్కలన్నీ తప్పుల తడకేనంటూ విమర్శించారు హరీశ్ రావు. ఇంతలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. హరీశ్ రావు నువ్వెంతగా నిలబడి మాట్లాడినా మంత్రివి కాలేవులే.. అంటూ ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి హరీశ్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హరీశ్ రావుకు ఎంత సమయం ఇచ్చినా సరిపోదని అన్నారు. ఎందుకంటే ఆయనకు మేనమామ కేసీఆర్ పోలికలు వచ్చాయని మాటలు చెప్పటం లోను..అబద్దాలను నిజంలా మార్చి చెప్పటంలో కేసీఆర్ పోలికలే హరీశ్ రావుకు వచ్చాయన్నారు. తాను మాట్లాడుతుంటే హరీశ్ రావు తనను ఇష్టానుసారంగా మాట్లాడారని..నువ్వు ఎంతగా మాట్లాడినా నీకు మంత్రి పదవి రాదు అని అన్నారని.. తనకు మంత్రి పదవి ఇవ్వాలో వద్దో.. మా ముఖ్యమంత్రి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటారన్నారు. కానీ హరీశ్ రావు మాత్రం ఎంత కష్టపడ్డా.. కేసీఆర్ తరువాత కేటీఆర్ తప్ప హరీశ్ రావు మాత్రం కాదని అన్నారు. హరీశ్ రావు ఎంత కష్టపడ్డా తండ్రీకొడులు కేసీఆర్, కేటీఆర్ వాడుకుంటున్నారు తప్ప అక్కడ న్యాయం జరగదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. చూపించిన లెక్కలన్నీ తప్పులేనని చెప్పారు. ఈ శ్వేతపత్రాన్ని ఏపీకి చెందిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారని తెలిపారు.

Next Story