కేసీఆర్‌ రైతుకు పట్టిన పెద్ద చీడ : క‌దం తొక్కిన‌ కోదండరాం

Kodandaram Fires On CM KCR. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన వ‌రి దీక్ష రెండ‌వ రోజు కొన‌సాగుతుంది

By Medi Samrat  Published on  28 Nov 2021 3:16 PM IST
కేసీఆర్‌ రైతుకు పట్టిన పెద్ద చీడ : క‌దం తొక్కిన‌ కోదండరాం

తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన వ‌రి దీక్ష రెండ‌వ రోజు కొన‌సాగుతుంది. దీక్ష‌కు సంఘీభావం తెలిపిన తెలంగాణ జ‌న స‌మితి అధినేత ప్రొపెస‌ర్‌ కోదండ రామ్ మాట్లాడుతూ.. చేనుకు చీడ పడితే ఏం చేయాలో రైతుకు తెలుసు.. కేసీఆరే రైతుకు పట్టిన పెద్ద చీడగా మారిండని విమ‌ర్శించారు. కల్లాల్లో ఎలాంటి వసతులు లేవని.. ఇసుక లారీలను పదిరోజులు ఆపితే వరి ధాన్యం ట్రాన్స్ పోర్ట్ చేయొచ్చ‌ని వివ‌రించారు. ఢిల్లీకి వెళ్లి తేల్చుకు వస్తా అన్న కేసీఆర్.. ఫామ్ హౌజ్ లో మలుచుకుని పన్నడని విమ‌ర్శించారు.

ఢిల్లీకి వెళ్లి వచ్చాక ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ను పోతం పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని కోదండ రామ్ అన్నారు. రైతులు ఏం పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఉందని.. కేసీఆర్ రైతు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌భుత్వం వర్షాకాలం పంట, యాసంగి పంట రెండు కొనాలని.. రైతుల కోసం ఎక్కడి దాకైనా కొట్లాడుతామ‌ని వ‌రి దీక్ష కార్య‌క్ర‌మం వేదికగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు కోదండ రామ్‌.


Next Story