ఇలాంటి తప్పులు చేయకండి.. ఇది వార్నింగ్ కాదు.. మరొకటి..!

Kodandaram About Million March. తెలంగాణలో ఖమ్మం,వరంగల్,నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

By Medi Samrat  Published on  9 March 2021 9:33 AM GMT
ఇలాంటి తప్పులు చేయకండి.. ఇది వార్నింగ్ కాదు.. మరొకటి..!

తెలంగాణలో ఖమ్మం,వరంగల్,నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీలు హోరా హూరీగా ప్రచారాలు చేస్తున్నాయి. మిలియన్ మార్చ్ జరిగి రేపటికి పది సంవత్సరాలు అవుతుందని.. తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ తెలిపారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమర వీరులకు నివాళి, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వరంగల్‌లో అంబేడ్కర్ విగ్రహం నుంచి అమర వీరుల స్థూపం వరకు జరిగే ర్యాలీలో తానూ పాల్గొంటానని కోదండరామ్ వెల్లడించారు. ప్రభుత్వం మిలియన్ మార్చ్‌ను గుర్తు చేసుకునే ప్రయత్నం చేయలేదని ఆక్షేపించారు.

కేసీఆర్ నియంతృత్వంగా ప్రజల భాగస్వామ్యాన్ని రూపుమాపుతున్నారని కోదండరాం ఆరోపించారు. అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. అసమర్థ, నిరంకుశ పాలనను తరిమికొట్టాలని ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. గత పట్టభద్రుల ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందని.. దొంగ ఓట్లు వేసి కేసుల్లో ఇరుక్కోవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నా ఓటర్లంతా మార్చి 14 కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.

పట్టభద్రుల నుంచి తమకు మంచి స్పందన లభిస్తుందని చెప్పారు.ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మనీ, మందు, పోల్‌ మేనేజ్‌మెంట్‌ మీద ఆధారపడిందని కోదండరాం ఆరోపించారు. కేయూలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండించారు. గత ఎన్నికల్లో గెలిపించినందుకు.. యూనివర్శిటీలను అభివృద్ది చేయాల్సింది పోయి.. సొంత విశ్వవిద్యాలయాలను నెలకొల్పుకున్నారని విమర్శించారు.


Next Story
Share it