ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు, నాయకులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు

By Medi Samrat  Published on  21 May 2024 7:30 AM IST
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు, నాయకులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. పలువురు తెలంగాణ నాయకులు కూడా ఏపీ ఫలితాలపై జోస్యం చెబుతున్నారు.

తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు.. గెలవాలి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించినట్లే జగ‌న్ అహంకారమే ఆయనను ఓడిస్తోందన్నారు. జగన్ అభివృద్ధిపై దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదని తేల్చేశారు.

Next Story