Khammam: స్కూల్ పిల్లల జుట్టు కత్తిరించిన లేడీ టీచర్.. సస్పెన్షన్‌ వేటు

ఖమ్మం జిల్లాలో ఓ లేడీ టీచర్‌ మితిమీరి ప్రవర్తించింది.

By Srikanth Gundamalla  Published on  28 July 2024 11:30 AM IST
khammam, teacher, hair cut,  15 students,  school, suspended ,

Khammam: స్కూల్ పిల్లల జుట్టు కత్తిరించిన లేడీ టీచర్.. సస్పెన్షన్‌ వేటు

ఖమ్మం జిల్లాలో ఓ లేడీ టీచర్‌ మితిమీరి ప్రవర్తించింది. జుట్టుపెంచుకుంటున్నారనీ, ఎన్ని సార్లు చెప్పినా కటింగ్ చేయించుకోకుండా స్కూల్‌కి వస్తున్నారని కోపంతో బార్బర్ అవతారం ఎత్తింది. కత్తెరతో ఇష్టం వచ్చినట్లుగా పిల్లల జుట్లను కత్తిరించింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు సదురు లేడీ టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. స్పందించిన వారు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలోని కల్లూరు మండలం పెరువంచ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పేరువంచ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లీష్ లేడీ టీచర్‌ శనివారం ఉదయం స్కూల్లో సుమారు 15 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. తలంతా గాట్లు గాట్లుగా పెట్టింది. స్కూల్‌ అయిన తర్వాత విద్యార్థులు గాట్లు పెట్టుకుని ఇంటికెళ్లారు. దాంతో.. పిల్లలను చూసిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఏం జరిగిందని ఆరా తీసి.. సదురు మహిళా టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేశారు. విద్యార్థులకు పెనుకోరుకుడు కటింగ్ చేసిన ఉపాధ్యాయిరాలిని నిలదీశారు. అవమాన భారంతో ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.

ఇక దీనిపై మాట్లాడిన సదురు మహిళా టీచర్‌..తాను ఎన్నోసార్లు కటింగ్ చేయించుకోవాలని చెప్పినట్లు సమర్ధించుకున్నారు. కానీ.. పిల్లలు మాట వినడం లేదని అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చారు. హోంవర్క్ చేయట్లేదని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. క్రమశిక్షణ లేకుండా ఉంటున్నారని అందుకే జుట్టు కత్తిరించ వలసి వచ్చిందని తెలిపారు. మరోవైపు విద్యార్థులు మాట్లాడుతూ.. టీచర్ కావాలనే తమ తల వెంట్రుకలను ఇష్టారీతిన కత్తిరించారని ఆరోపించారు. క్యాప్ పెట్టుకుంటే కవర్‌ అవుతుందనే సమాధానం ఇచ్చారని తెలిపారు విద్యార్థులు. పోలీసులు కూడా స్కూల్‌ కి వెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేసేలా చేశారు. ఆ తర్వాత ఈ ఘటనను ఇతర ఉపాధ్యాయులు డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. సీరియస్‌గా తీసుకున్న డీఈవో సదురు మహిళా టీచర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story