తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు కీలక సూచన

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TG BIE) ఇటీవలే ఇంటర్ పరీక్ష ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది.

By అంజి  Published on  6 Nov 2024 5:46 AM GMT
students, Telangana, Inter

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు కీలక సూచన 

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TG BIE) ఇటీవలే ఇంటర్ పరీక్ష ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ పెంపు వర్తిస్తుంది. సాధారణ కోర్సులు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు ఇప్పుడు రూ.520 చెల్లించాల్సి ఉంటుంది. వృత్తి విద్యా కోర్సుల్లో ఉన్నవారు రూ.750, థియరీకి రూ.520, ప్రాక్టికల్స్‌కు రూ.230తో చెప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జనరల్ ఆర్ట్స్ కోర్సుల ఫీజు రూ.510 నుంచి రూ.520కి పెంచారు. జనరల్ సైన్స్, ఒకేషనల్ చదువుతున్న వాళ్లు ఇప్పుడు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. థియరీకి రూ.520, ప్రాక్టికల్ పరీక్షలకు రూ.230 చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన తేదీలు:

ఆలస్య రుసుము లేకుండా: నవంబర్ 6–26

ఆలస్య రుసుము రూ.100: నవంబర్ 27–డిసెంబర్ 4

ఆలస్య రుసుము రూ.500: డిసెంబర్ 5–11

ఆలస్య రుసుము రూ.1,000: డిసెంబర్ 12–18

ఆలస్య రుసుము రూ.2,000: డిసెంబర్ 19–27

Next Story