పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు

Key orders of High Court regarding Revanth Reddy's Padayatra. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.

By M.S.R  Published on  6 March 2023 6:20 PM IST
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court


పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. తన యాత్ర సందర్భంగా అదనపు సెక్యూరిటీ కల్పించాలని రేవంత్ రెడ్డి కోర్టును ఇంతకు ముందు కోరారు. రేవంత్ యాత్ర చుట్టు 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పింది. అయితే అది కేవలం యాత్ర, బందోబస్తు, ట్రాఫిక్ కోసమే ఇస్తున్నారని రేవంత్ తరపు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు అదనపు భద్రత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నైట్ హాల్ట్ లోనూ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించింది.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. తన యాత్రలో భాగంగా కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం మెుత్తం ప్రజా దోపిడీకి పాల్పడుతుందని.. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కొండగట్టును అభివృద్ధి చేస్తానని అబద్ధపు వాగ్ధానాలతో సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసి 125 అడుగుల విగ్రహం కట్టిస్తానని సీఎం కుమార్తె కవిత మోసం చేశారని.. తండ్రి, కుమారుడు, కూతురు కుటుంబం మెుత్తం దేవుళ్లను మోసం చేసి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.


Next Story