ఈ రోజు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌లతో రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులతో కీలకమైన సమావేశాలు జరిగాయి. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 ఉమ్మడి జిల్లాల పార్టీ ఇంచార్జ్ లు, పార్లమెంట్ ఇంచార్జ్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులతో జిల్లాల వారీగా సమావేశాలు జరిగాయి. ప్రధానంగా డీసీసీ అధ్యక్షులు, మండల కమిటీలు సంస్థాగత నిర్మాణం పైన అలాగే రాష్ట్రంలోని కార్పొరేషన్ లు, బోర్డులలో ఉండే డైరెక్టర్లు, మెంబర్ల నియమకలపై కూడా చర్చ జరిగింది. ఇప్పటకే జిల్లా ఇంచార్జ్ లు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఇద్దరు చొప్పున ఆశావహుల పేర్లను సిపారసు చేశారు.
జిల్లా ఇంచార్జ్ లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీలు కలిసి వాటికి సంబంధించిన నివేదికలను మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్‌లకు అందజేశారు. నియోజక వర్గానికి ఇద్దరు చొప్పున ప్రభుత్వ సంస్థలలో నియమించే వారిలో సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ పేర్లను సిఫారసు చేయడం జరిగింది. అలాగే 60 శాతం మంది అభ్యర్థులను 50 ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
నివేదికలు అన్ని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లకు అందిన నేపథ్యంలో రేపో, ఎల్లుండో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. సమావేశం పూర్తికాగానే డైరెక్టర్ల పోస్టులు, ప్రభుత్వ సంస్థలలో సభ్యుల పోస్టుల నియామకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.. ఈ రోజు జరిగిన సమావేశాలలో సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన అంశాలపై, పార్టీ పదవులు, ప్రభుత్వ సంస్థలలో సభ్యుల నియమాకాలపైనే చర్చ జరిగింది.