ఆ బిల్లుకు చట్టబద్ధత..టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్ధతపై రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik
ఆ బిల్లుకు చట్టబద్ధత..టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్ధతపై రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. బీసీ కులగణనతో తెలంగాణలో కొత్త చాప్టర్ మొదలైందని మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా కులగణన చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. బిహార్, కర్ణాటకలో కులగణన సర్వే చేశారు.. అసెంబ్లీలో మాత్రం తీర్మానం చేయలేకపోయారని సెటైర్ వేశారు. ఢిల్లీకి అన్ని పార్టీలను తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కులగణనపై ప్రజాభవన్‌లో అంతకుముందు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులగణన విషయంలో భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ దాదాపు 25 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని అన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ పూర్తి పారదర్శకంగా సర్వే చేపట్టామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు అని సీఎం రేవంత్ అన్నారు. నేను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటం లేదు. మా నాయకుడి ఆదేశాలు పాటించే వ్యక్తి మాట్లాడుతున్నా. నాయకుడి ఆదేశాలను పాటించడమే నా ధర్మం.. అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.