ఎలుకలా బెంగళూరుకు పారిపోయారు

KCR like rat ran away to Bengaluru when PM Modi visited Hyd. వైఎస్ఆర్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై

By Medi Samrat  Published on  27 May 2022 10:33 AM GMT
ఎలుకలా బెంగళూరుకు పారిపోయారు

వైఎస్ఆర్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్ల‌డంపై షర్మిల స్పందిస్తూ.. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసే దమ్ముంటే బెంగళూరుకు ఎందుకు పారిపోయారని ముఖ్యమంత్రిని షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లే బదులు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రధాని మోదీని ప్రశ్నించి ఉండవచ్చని ఆమె అన్నారు. ప్రధాని మోదీ (పిల్లి) హైదరాబాద్‌కు వస్తే ఎలుకలా కేసీఆర్ బెంగళూరుకు పారిపోయారని ఆమె అన్నారు.

టీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడిందని ప్రధాని మోదీ అంటున్నారు., మరోవైపు బీజేపీ అవినీతికి స‌బంధించిన చిట్టా తన వద్ద ఉందంటూ కేసీఆర్‌ చెబుతున్నారు., అయితే ఇద్దరూ ముఖాముఖి అవ‌కుండ‌ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇద్దరి వ‌ద్ద‌ అవినీతికి సంబంధించిన‌ సాక్ష్యాలు ఉన్నాయా లేక రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించేందుకు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా అని షర్మిల ప్రశ్నించారు.


Next Story
Share it