సీడబ్ల్యూసీ సమావేశంతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు : కేసీ వేణుగోపాల్

సీడబ్ల్యూసీ తొలి సమావేశం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామ‌ని ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు

By Medi Samrat  Published on  15 Sep 2023 12:16 PM GMT
సీడబ్ల్యూసీ సమావేశంతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు : కేసీ వేణుగోపాల్

సీడబ్ల్యూసీ తొలి సమావేశం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామ‌ని ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణం సభా వేదిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నామ‌ని తెలిపారు. నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ సీఎం లతో సహా 90 మంది ఈ సమావేశానికి హాజరవుతారని వెల్ల‌డించారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, ఇచ్చిన హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని.. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని విమ‌ర్శించారు.

దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ అని కేసీ కేసీ వేణుగోపాల్ అన్నారు. బీజేపీ పాలనలో జాతీయత ఎక్కడుంది? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ సమావేశంతో తెలంగాణా రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయని పేర్కొన్నారు. రేపు ఉదయం 10.30కి ఎక్స్ టెండేడ్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుందని తెలిపారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు విజయభేరి బహిరంగ సభ ఉంటుందని.. సభలో 6 గ్యారెంటీలను సోనియా గాంధీ విడుదల చేస్తారని.. వచ్చే మూడు రోజులు చాలా కీలకమైనవి తెలిపారు.

Next Story