కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు.

By -  Medi Samrat
Published on : 27 March 2026 5:07 PM IST

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు ఆమె వివరించారు. . తమ పార్టీలో యువత, మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Next Story