ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి.. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ‌ అనూహ్య పరిణామం

Kaushik Reddy Nominated As MLC. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేఫ‌థ్యంలో నియోజకవర్గ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

By Medi Samrat  Published on  2 Aug 2021 4:17 AM GMT
ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి.. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ‌ అనూహ్య పరిణామం

హుజూరాబాద్ ఉప ఎన్నిక జ‌రుగ‌నున్న నేఫ‌థ్యంలో నియోజకవర్గ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గ కీల‌క నేత‌లంతా టీఆర్ఎస్ గూటికి చేరారు. అలా కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌లో చేరిన యువ‌నేత‌ కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వ‌నున్న‌ట్లు కెబినేట్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు సంచ‌ల‌న‌మైంది. గత నెలలో కాంగ్రెస్‌ పార్టీని వీడిన పాడి కౌశిక్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ యువ నాయకుడు పాడికౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్తును రాజకీయంగా అందిస్తామని ప్రకటన చేశారు.


మాట ఇచ్చిన‌ట్లుగానే కేసీఆర్ 15 రోజుల్లోనే కౌశిక్‌ను ఎమ్మెల్సీని చేసేందుకు ప్ర‌క్రియ‌ ప్రారంభించారు. ఈ మేర‌కు ఆదివారం భేటీ అయిన కెబినేట్ భేటీలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేశారు. త్వరలోనే కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ద‌క్క‌బోతుంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ఆయ‌న అనుచ‌ర‌గ‌ణంలో ఉత్సాహం మొద‌లైంది. అయితే.. కౌశిక్ రెడ్డి అలా రాగానే ఇలా పదవి.. ఏంట‌ని మొద‌టి నుండి పార్టీని అంటిపెట్టుకున్న నియోజ‌క‌వ‌ర్గ‌ టీఅర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఉన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపుతారనే విష‌య‌మై సందిగ్ధత నెల‌కొంది.


Next Story