చంద్రబాబు నా మీద నమ్మకంతో ఈ బాధ్య‌త‌ అప్పజెప్పారు

Kasani Gnaneshwar Mudiraj. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో టీడీపీలో జాయిన్ అయ్యినందుకు సంతోషంగా ఉందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు

By Medi Samrat  Published on  11 Dec 2022 7:45 PM IST
చంద్రబాబు నా మీద నమ్మకంతో ఈ బాధ్య‌త‌ అప్పజెప్పారు
జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో టీడీపీలో జాయిన్ అయ్యినందుకు సంతోషంగా ఉందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. సీలకు, బడుగులకు న్యాయం జరిగింది అంటే అది టిడిపి వల్లేన‌ని అన్నారు. బీసీలకు ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని పెట్టి డెవలప్ చేసారు. ఈ రోజు IT అభివృద్ది చెందినదంటే చంద్రబాబు వల్లేన‌ని అన్నారు. టిడిపి హాయాంలో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను.. మళ్లీ చంద్రబాబు నాయుడు నా మీద నమ్మకంతో ఈ భాద్యత అప్పజెప్పారు. బడుగు బలహీన వర్గాలు మళ్లీ టిడిపి జెండా నిలబెట్టాల్సిన భాద్యత ఉంది. తెలుగుదేశం పార్టీతో అందరికి సమ న్యాయం జరుగుతుంది. పచ్చ జెండా గుండెకు హత్తుకున్నారు అంటే అది ఎన్టీఆర్ చలవే అని అన్నారు. జిల్లాల నుండి ఇంకా పెద్ద సంఖ్యలో జాయిన్ అవుతా అంటున్నారు.. ఆయా జిల్లాలోనే జాయినింగ్స్ పెట్టుకుందాం. ఈ నెల 21న జరగబోయే ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Next Story