కేసీఆర్ అబ‌ద్ధాలు చెపుతున్నారు.. ఆయ‌న పాల‌న అంతా అవినీతే : కర్ణాటక మంత్రి

మేము కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇస్తున్నామని కర్ణాటక మంత్రి మునియప్ప తెలిపారు.

By Medi Samrat  Published on  20 Nov 2023 2:05 PM IST
కేసీఆర్ అబ‌ద్ధాలు చెపుతున్నారు.. ఆయ‌న పాల‌న అంతా అవినీతే : కర్ణాటక మంత్రి

మేము కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇస్తున్నామని కర్ణాటక మంత్రి మునియప్ప తెలిపారు. గాంధీ భవన్ లో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో మేము ప‌థ‌కాలు ఇవ్వడం లేదని కేసీఆర్ అబ‌ద్ధాలు చెపుతున్నారని అన్నారు. దేశంలో మొదటిసారి గృహలక్ష్మి పథకాన్ని కర్ణాటకలో పెట్టామని తెలిపారు. కేసీఆర్ పదిసంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు.

మోదీ దళిత వర్గాలకు మంచి చేయాలని అనిపిస్తే ముందు ఆర్డినెన్స్ చేసి పార్లమెంట్ కి తీసుకురండి.. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేవి చేస్తుంది.. కర్ణాటకలో చెప్పిన‌వి వంద రోజుల్లోనే అమలు చేశామని తెలిపారు.

తెలంగాణాలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని ఆదరించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు అభివృద్ధి ఎట్లా జరిగిందో మీకు తెలుసు.. కేసీఆర్ పాలన అంతా అవినీతే అని ఆరోపించారు.

Next Story