లిక్కర్ డబ్బులతోనే బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్ళింది : కర్ణాటక కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారని కర్ణాటక కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ అన్నారు

By Medi Samrat  Published on  20 Nov 2023 2:53 PM IST
లిక్కర్ డబ్బులతోనే బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్ళింది : కర్ణాటక కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారని కర్ణాటక కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ అన్నారు. గత చివరి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ కూల్చేసింద‌ని.. డబులింజన్ సర్కార్ నినాదంతో వచ్చిన బీజేపీని కర్ణాటక ప్రజలు ఓడించారని వివ‌రించారు. తెలంగాణలో ట్రిబులింజన్ పేరుతో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లు కలిసి పనిచేస్తున్నాయ‌ని.. అయినా కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా వున్నారని పేర్కొన్నారు.

ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసింది కాంగ్రెసే అన్నారు. కేసీఆర్ తన కూతురును జైలుకు వెళ్లకుండా కాపాడుకుంటున్నాడని కామెంట్ చేశారు. తెలంగాణ లో బీసీలకు 23% రిజర్వేషన్ లు మాత్రమే ఉన్నాయి. కులగనణ చేసి రిజర్వేషన్ లు పెంచుతామ‌న్నారు. రాహుల్ గాంధీ బీసీల రిజర్వేషన్ ల కోసం డిమాండ్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ ప్రజల కల నెరవేర్చిందన్నారు.

తెలంగాణ లిక్కర్ పాలసీ నుండి వచ్చిన డబ్బులతోనే బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్ళిందని ఆరోపించారు. కర్ణాటక రైతులకు సరిపడేలా 10 గంటల కరెంట్ ఇస్తుందని.. కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నార‌ని వెల్ల‌డించారు. కుమారస్వామితో మాట్లాడించేవారు బీజేపీ, బీఆర్ఎస్‌లే న‌న్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల మిస్సింగ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్నా ఫైనాన్స్ పరంగా చాలా వీక్ గా వున్నారని.. బీసీ ల సంక్షేమం, ప్రజా ప్రభుత్వమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు.

Next Story