మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మున్సిఫ్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ మార్చి 22న కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన మున్సిఫ్ కోర్టు జడ్డి ఆర్‌ఎస్ ప్రవీణ్‌పై కేసు నమోదుకు కరీంనగర్ మూడో పట్టణ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలావుంటే.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉండి.. ఆరేళ్ల సర్వీసు కాలం ఉన్నా ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 20న ఆమోదం తెలిపింది. ఆయన స్థానంలో గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్‌కు సర్కారు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకే రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలను ప్రవీణ్ కుమార్ ఖండించారు. హుజురాబాద్ బరిలో తాను ఉండనని స్పష్టం చేశారు.