ఒత్తిడి తగ్గాలంటే ఆ టీ తాగాలంటున్న ఎమ్మెల్సీ కవిత.!

Kalvakuntla Kavitha Selfie With Tea Cup. ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాకనిదే

By Medi Samrat
Published on : 15 Dec 2020 6:10 PM IST

ఒత్తిడి తగ్గాలంటే ఆ టీ తాగాలంటున్న ఎమ్మెల్సీ కవిత.!

ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాకనిదే ఇతర పనులు చేయడానికి ఇష్ట పడరు. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దినచర్యలో భాగంగా మారిపోయింది. పేద, ధనిక అని తేడా లేకుండా ఉదయం లేవగానే ప్రతి రోజు ఒక కప్పు టీ తోనే ప్రారంభిస్తారు.ఇలా మన దేశంలో టీ కి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎంతో అలసటగా, తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక కప్పు చాయ్ తాగటంతో ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే వివిధ రకాల వెరైటీలను టీ లను తయారు చేసుకొని వాటిని ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.



అయితే.. డిసెంబర్ 15 న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు జరుపుకుంటున్నాయి. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంతర్జాతీయ "టీ" దినోత్సవాన్ని పురస్కరించుకొని టీ తాగుతున్న సెల్ఫీ ఫోటోను ట్విటర్‌ ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ "నేడు అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా అల్లం చాయ్ తాగుతున్న నా సెల్ఫీ ఫోటోలను మీతో పంచుకున్నాను. మీరు కూడా టీ తాగుతున్న సెల్ఫీ ఫోటోను నాతో షేర్ చేసుకోండి" అంటూ కవిత ట్వీట్ చేశారు.

పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కప్పు టీ తాగితే ఆమజానే వేరేగా ఉంటుందని ఆమె తెలిపారు.అయితే కవిత చేసిన పిలుపు మేరకు తన ఫాలోవర్స్ కూడా టీ తాగుతూ సెల్ఫీ దిగిన ఫోటోలను ఆమెతో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం కవిత టీ తాగుతున్న సెల్ఫీ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది.


Next Story