రైలు పట్టాలపై కవిత.. యాక్షన్ లోకి దిగిన పోలీసులు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు.

By -  Medi Samrat
Published on : 28 Nov 2025 5:33 PM IST

రైలు పట్టాలపై కవిత.. యాక్షన్ లోకి దిగిన పోలీసులు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవితను పోలీసులు అడ్డుకోడానికి ప్రయత్నించడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. కార్యకర్తలతో కలిసి కవిత రైల్వే పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు.

Next Story