ఆయన మాట వినే ఓట్లు వేయలేదట..!
తెలంగాణ ఎన్నికల్లో ఓటింగ్ తక్కువగా నమోదవ్వడంపై ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 30 Nov 2023 7:07 PM ISTతెలంగాణ ఎన్నికల్లో ఓటింగ్ తక్కువగా నమోదవ్వడంపై ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీకి అనుమతి ఇవ్వలేదని, మునుగోడు బైపోల్‌నూ తమకు ఇదే పరిస్థితి ఎదురైందని కేఏ పాల్ అన్నారు. అందుకే తాను ఓటు వేయవద్దని ఓటర్లకు పలుమార్లు పిలుపు ఇచ్చానన్నారు. అందుకే ఈ రోజు తన మాట విని ప్రజలు ఓటు వేయనందుకు ధన్యవాదాలని అన్నారు. కేఏ పాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 79 శాతం ప్రజలు ప్రజా శాంతి పార్టీని కోరుకుంటున్నారని, కానీ, ఎన్నికల అధికారులు మాత్రం తన పార్టీ ఇనాక్టివ్ అని చెప్పి పోటీకి అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు చెప్పారు. తాము పోరాడితే ఐదు సీట్లలో రింగు గుర్తు ఇచ్చారని వివరించారు. ఈ కారణంగానే తాను ఓటర్లకు ఓటు వేయొద్దని పిలుపు ఇచ్చినట్టు చెప్పారు. అందరూ ఇంట్లోనే ఉండాలని, ఓటు వేయొద్దని చెప్పానని అన్నారు.
తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5గంటల వరకూ క్యూలైన్‌లో నిలబడిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.