అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయండి.. లేదంటే..

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయకుంటే తాను కోర్టులో పిల్ వేస్తానన్నారు.

By Medi Samrat  Published on  13 Dec 2024 4:46 PM IST
అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయండి.. లేదంటే..

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయకుంటే తాను కోర్టులో పిల్ వేస్తానన్నారు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు తనకు తెలిసిందన్నారు. పుష్కరాలు సహా వివిధ ఘటనల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా కొంతమంది మృతి చెందితే చంద్రబాబును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు సరే, మరి చంద్రబాబు కందుకూరులో ర్యాలీ నిర్వహించినప్పుడు 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయారన్నారు. మరి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారా? విచారణకు పిలిచారా? అని నిలదీశారు.

అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోందని హైకోర్టు నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాలని కోర్టును బన్నీ తరపు లాయర్లు కోరారు. వారి విన్నపాన్ని తిరస్కరించిన కోర్టు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో బన్నీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశాలున్నాయి.

Next Story