గెలిస్తే.. నెక్ట్స్‌ తెలంగాణ సీఎం నేనే : కేఏ పాల్

KA Paul Comments On Munugode Bypoll. మునుగోడు ప్రజలు నాపై ఎనలేని ప్రేమ చూపించారని ప్ర‌జాశాంతి పార్టీ అధినేత‌, మునుగోడు అభ్య‌ర్ధి కేఏ పాల్ అన్నారు.

By Medi Samrat  Published on  4 Nov 2022 8:08 AM GMT
గెలిస్తే.. నెక్ట్స్‌ తెలంగాణ సీఎం నేనే : కేఏ పాల్

మునుగోడు ప్రజలు నాపై ఎనలేని ప్రేమ చూపించారని ప్ర‌జాశాంతి పార్టీ అధినేత‌, మునుగోడు అభ్య‌ర్ధి కేఏ పాల్ అన్నారు. నల్గొండలో ఆయ‌న‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మునుగోడులో గెలిస్తే.. నెక్ట్స్‌ తెలంగాణ సీఎం నేనే అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలు మూడు సార్లు నాపై దాడికి యత్నించారని ఆరోపించారు. లక్షా 10 వేల ఓట్లు ఉంగరం గుర్తుకు పడ్డాయి.. పూర్తి లెక్క ఉంది నా దగ్గర ఉంద‌ని తెలిపారు. 50 వేల మెజారిటీతో నేను గెలవబోతున్నా.. నా గెలుపు రాష్ట్ర, దేశ రక్షణకు తొలి మెట్టు అని అన్నారు. సీఎం కేసీఅర్ పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడ్డారని విమ‌ర్శించారు. మా లాంటి యూత్ కు కేసీఆర్ ఇచ్చే మెసేజ్ ఏంటీ ? అని ప్ర‌శ్నించారు. ఇదిలావుంటే నిన్న మునుగోడు ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ నిన్న ముగిసింది. స్వ‌తంత్ర్య అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగిన కేఏ పాల్.. చేతి వేళ్ల‌కు రింగులు ధ‌రించి పోలింగ్ బూత్‌ల వ‌ద్ద ప‌రుగులు పెడుతూ హ‌డావుడి చేశారు. ఈసీ ఆయ‌న‌కు రింగు గుర్తు కేటాయించ‌డం విశేషం.


Next Story
Share it