ఉంగరం గుర్తుకు ఓటేస్తే.. మునుగోడు అమెరికా అవుద్ది

KA Paul Campaign Munugode Bypoll. మునుగోడు ఉప ఎన్నికల్లో పలు పార్టీల నాయకులు ప్రచారంలో మునిగిపోయారు.

By Medi Samrat  Published on  19 Oct 2022 2:00 PM GMT
ఉంగరం గుర్తుకు ఓటేస్తే.. మునుగోడు అమెరికా అవుద్ది

మునుగోడు ఉప ఎన్నికల్లో పలు పార్టీల నాయకులు ప్రచారంలో మునిగిపోయారు. ఇక స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ కూడా తనదైన రీతిలో ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. ఆయనకు ఉంగరం గుర్తును కేటాయించడంతో.. ఆ గుర్తుకు ప్రజలందరూ ఓటు వేయాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తును కేటాయించారని చెప్పిన పాల్.. ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా మాదిరిగా మారుస్తానని ఆయన చెప్పారు. 'ఉంగరం గుర్తుకు ఓటేయండి.. మునుగోడును అమెరికా చేసి పారేద్దాం' అంటూ ఆయన తనదైన స్టయిల్లో చెప్పారు. ఓ వైపు పాల్ మాట్లాడుతుండగానే... ఆయన మాటలకు కౌంటర్లు ఇస్తూ జనం కూడా ఉత్సాహం చూపారు.

ఎన్నికల ప్రచారానికి వచ్చిన కే ఏ పాల్.. ఓ హెటల్ లో దోశ వేస్తూ కనిపించారు. చేతులతో దోశను కాలుస్తూనే.. అక్కడున్న వారితో ఆయన మాట్లాడారు. నాకు దోశెలు వేయడం రాదని అనుకుంటున్నారా? నేను పదోతరగతి రెండుసార్లు తప్పాను. 6 ఏళ్ల ప్రాయంలో బాలకార్మికునిగా పని చేశాను. దోశెలు వేయడంతో పాటు అన్ని పనులు వచ్చు. ఇక ఈ ఎన్నికల్లో నాకు ఉంగరం గుర్తును కేటాయించారు. ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా చేసేద్దాం. మీరు నన్ను గెలిపిస్తే ఏడు మండలాల్లో ఏడు వేల మందికి ఉద్యోగాలిప్పిస్తాను. అందుకే నిరుద్యోగులందరూ నా పార్టీలో జాయిన్‌ అవ్వండి. ఈ వీడియోను చూస్తున్న వారందరూ షేర్‌ చేయండి. ఉంగరం గుర్తుకు ఓటేయ్యండి. మునుగోడును అమెరికాలా మార్చుకుందాం' అని చెప్పారు. ఇక కొద్దిరోజుల కిందట ఆయన ప్రచారానికి వెళ్లగా.. చాలా మంది సీఎం, సీఎం అంటూ అరిచిన సంగతి తెలిసిందే. ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటూ ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది.


Next Story