'జై తెలంగాణ' అంటూ నినదించిన కవిత.. జైలు నుంచి బయటకు రాగానే..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్‌ఎస్ నాయకురాలు కె కవిత మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు.
By అంజి Published on 28 Aug 2024 1:17 AM GMT'జై తెలంగాణ' అంటూ నినదించిన కవిత.. జైలు నుంచి బయటకు రాగానే..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్‌ఎస్ నాయకురాలు కె కవిత మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ‘జై తెలంగాణ’ అంటూ కవిత నినాదం చేశారు. జైలు ప్రాంగణం వెలుపల డప్పులు వాయిస్తూ క్రాకర్స్ పేల్చి ఆమెకు మద్దతుదారుల నుంచి ఘనస్వాగతం లభించింది. తీహార్ జైలు వెలుపలి వీడియోలో కె కవిత తన కొడుకు, భర్తను కౌగిలించుకున్నట్లు చూపబడింది. ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ నాయకుడు కెటి రామారావు కూడా అక్కడే ఉన్నారు.
బయట విలేకరులను ఉద్దేశించి బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవిత మాట్లాడుతూ.. 'మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. దాదాపు 5 నెలల తర్వాత ఈరోజు నా కొడుకు, అన్న, భర్తను కలిసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాను. ఈ పరిస్థితికి రాజకీయాలే కారణమని.. దేశానికి తెలుసు. రాజకీయాల వల్లే జైల్లో పెట్టారు, నేను ఏ తప్పు చేయలేదు, పోరాడతాను. దీనిపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతామని, బీఆర్‌ఎస్, కేసీఆర్ బృందాన్ని విడదీయరాని విధంగా చేశారన్నారు కవిత.
అనంతరం ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కవిత సమావేశమయ్యారు. తన సోదరుడు కేటీఆర్‌కు స్వీట్లు తినిపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి కె కవితను అరెస్టు చేసింది. రెండ్రోజుల తర్వాత, అదే కేసులో ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి సీబీఐ ఆమెను అరెస్టు చేసింది.
బీఆర్ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరైంది. కవిత సుమారు ఐదు నెలల పాటు కస్టడీలో ఉన్నారని, ఈ కేసుల్లో ఆమెపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు పూర్తయిందని జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.