తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్
Justice Ujjal Bhuyan to be the new Chief Justice of Telangana. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు.
By Medi Samrat Published on 17 May 2022 9:00 PM ISTతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. చీఫ్ జస్టిస్ గా ఉన్న ఉన్న సతీష్ చంద్రమిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలిజియం బదిలీలను సిఫార్సు చేసింది. ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ ల నియమకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది. తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గువాహటి రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను నియమించనున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమ్జద్ ఎ.సయిూద్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియామకం అయ్యారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం.ఛాయాను గువాహటి హైకోర్టు సీజేగా నియమించారు. బాంబే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్ షిండే రాజస్థాన్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ భుయాన్ 2011-17 అక్టోబర్ గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మిజోరాం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964, ఆగస్టు 2వ తేదీన అసోంలోని గువహటిలో జన్మించారు. ఆయన తండ్రి సుచేంద్ర నాథ్ భూయాన్ సీనియర్ న్యాయవాది.భూయాన్ తన పాఠశాల విద్యను గువహటిలోని డాన్ బాస్కో స్కూల్లో, ఉన్నత విద్యను కాటన్ కాలేజీలో అభ్యసించారు. ఢిల్లీలోని కిరోరి మాల్ కాలేజీలో డిగ్రీలో పట్టా పొందారు.
గౌహతి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందగా.. 1991, మార్చి 20వ తేదీన బార్ కౌన్సిల్ ఆఫ్ అసోంలో పేరు నమోదు చేయించుకున్నారు. గౌహతి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా 2011 అక్టోబర్ 17న నియమితులయ్యారు. 2019లో బాంబే హైకోర్టుకు బదిలీ- జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2021 అక్టోబర్‌లో తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియామకం జరిగింది.