తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం

Justice Satish Chandra Sharma takes over as Telangana HC CJ. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం

By Medi Samrat
Published on : 11 Oct 2021 11:46 AM IST

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో గవర్నర్‌ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ హిమా కోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్‌ ఎం.ఎస్‌.ఆర్‌.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


Next Story