14న యాదాద్రికి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

Justice NV Ramana Visits Yadadri On 14th. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ నెల 14న యాదాద్రిలో

By Medi Samrat
Published on : 12 Jun 2021 7:02 PM IST

14న యాదాద్రికి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ నెల 14న యాదాద్రిలో పర్యటించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ కూడా సీజేఐతో పాటు యాదాద్రికి వెళ్లనున్నారు. సీజేఐ, గవర్నర్, సీఎం కలిసి యాదాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. నిన్న హైదరాబాద్‌ చేరుకున్న సీజేఐకి శంషాబాద్‌ విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాజ్‌భవన్‌లోని అతిథి గృహంలో బస చేసిన జస్టిస్‌ రమణ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉంటారు. ఇక్కడే వివిధ కార్యక్రమాలు, సదస్సుల్లో ఆయన పాల్గొంటారు.

ఇదిలావుంటే.. జస్టిస్ ఎన్వీ రమణను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీజేఐని కలిశారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి దేశ అత్యున్నత పదవిలో నియామకం కావడం యావత్ తెలుగు ప్రజలకు గర్వకారణంగా ఉందని కొనియాడారు.


Next Story