Telangana: హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 23 July 2023 12:29 PM ISTTelangana: హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆరాధేతో ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు పాల్గొన్నారు. కాగా, సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసుల మేరకు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధే నియామకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రఛూడ్‌తో సంప్రదింపుల తర్వాత జస్టిస్ ఆలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు.
ఏప్రిల్ 13, 1964న రాయ్‌పూర్‌లో జన్మించిన అలోక్ ఆరాధే జూలై 12, 1988న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. అతను జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. 2007 ఏప్రిల్ మాసంలో అలోక్ ఆరాధే సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. అతను డిసెంబర్ 29, 2009న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఫిబ్రవరి 15, 2011న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 నుండి 2018 నుండి ఆయన జమ్మూ కాశ్మీర్ తాత్కాలిక సీజేగా పనిచేశారు. జస్టిస్ అలోక్ ఆరాధే నవంబర్ 17, 2018న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు, జూలై 3, 2022న కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.