తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, పలువురు మంత్రులు హాజరయ్యారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యే ముందు ఆయన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ అపరేష్ కుమార్ ఇంతకు ముందు ఝార్ఖండ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 2022లో ఝార్ఖండ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు.