ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జూపల్లి భేటీ

Jupally Krishnarao meet with MP Komatireddy Venkatreddy. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాజీమంత్రి, బీఆర్ఎస్ బ‌హిష్కృత నేత‌ జూపల్లి

By Medi Samrat
Published on : 11 Jun 2023 5:09 PM IST

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జూపల్లి భేటీ

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాజీమంత్రి, బీఆర్ఎస్ బ‌హిష్కృత నేత‌ జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. ఈ భేటీలో మ‌రో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సైతం పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరే ముందు ముఖ్యనేతలతో జూపల్లి భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే కొమటిరెడ్డితో జూపల్లి సమావేశమయినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

అయితే భేటీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. జూపల్లి కృష్ణారావుని తేనీటి విందుకై మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జూపల్లి, తాను పాత మిత్రులమేనన్నారు. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జూపల్లిని ఆహ్వానించాన‌ని.. అయితే పార్టీలో చేరే అంశంపై ఆలోచించి చెప్తానని జూపల్లి కృష్ణారావు చెప్పినట్లు కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పేర్కొన్నారు.


Next Story