రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి

Judge warns Revanth Reddy.ఏసీబీ న్యాయస్థానం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు రేవంత్ రెడ్డి హాజరుకాకపోవడం పట్ల న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2021 5:55 PM IST
Judge warns Revanth Reddy

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారిస్తున్న ఏసీబీ న్యాయస్థానం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు రేవంత్ రెడ్డి హాజరుకాకపోవడం పట్ల న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగతంగా హాజరు కాకపోతే వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారణ జరపాలని సుప్రీంకోర్టు, హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేశాయని, ఆ ఆదేశాల నేపథ్యంలో నిందితులంతా తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందేనని జస్టిస్ సాంబశివరావు నాయుడు తేల్చి చెప్పారు. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు ఉదయసింహ, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ నిందితులుగా ఉన్నారు.

ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రత్యేక కోర్టు విచారణకు సోమవారం హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సాంబశివరావునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోర్టు విచారణకు నిందితులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే నని తేల్చిచెప్పారు. మంగళవారం నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్న నేపథ్యంలో నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, లేకపోతే అరెస్టు వారంట్‌ జారీ చేస్తానని హెచ్చరించారు.


Next Story