బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈరోజు పోలింగ్ ముగియగా.. 14వ తేదీన ఫలితం రానుంది.
అయితే.. ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 46 శాతానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 41 శాతం నుంచి 42 శాతం ఓట్లు, బీజేపీకి 6 నుంచి 8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు..
చాణక్య స్ట్రాటజీస్ -
కాంగ్రెస్ - 46 శాతం
బీఆర్ఎస్ - 41 శాతం
బీజేపీ - 6 శాతం.
పీపుల్స్ పల్స్ -
కాంగ్రెస్ - 48 శాతం
బీఆర్ఎస్ - 41 శాతం
బీజేపీ - 6 శాతం
స్మార్ట్ పోల్ -
కాంగ్రెస్ - 48.2 శాతం
బీఆర్ఎస్ - 42.1 శాతం
బీజేపీ - 8 శాతం