పవన్ విజయవాడ పర్యటన రద్దు.. ఫ్లైట్ టేకాఫ్‌కు నో పర్మిషన్
విజయవాడలో చంద్రబాబును కలవాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు.
By అంజి Published on 9 Sept 2023 7:00 PM IST
పవన్ విజయవాడ పర్యటన రద్దు.. ఫ్లైట్ టేకాఫ్‌కు నో పర్మిషన్
హైదరాబాద్: జనసేన పార్టీ (జెఎస్‌పి) అధినేత, ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్‌కు చెందిన చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ శనివారం బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరేందుకు అనుమతి నిరాకరించబడింది. పవన్ కళ్యాణ్ విమానాన్ని పోలీసులు నిలిపివేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆయన విజయవాడ బయలుదేరారు. విమానాన్ని విజయవాడకు టేకాఫ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారని జేఎస్పీ నేతలు తెలిపారు. ఆదివారం మంగళగిరిలోని జేఎస్పీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు పవన్ కల్యాణ్ విజయవాడ వెళ్తున్నట్లు వారు తెలిపారు.
టేకాఫ్‌కు అనుమతి నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన పర్యటన శాంతిభద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉందని పోలీసులు చెప్పినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబును పోలీసులు విజయవాడకు తరలించారు. అంతకుముందు, పవన్ కళ్యాణ్ నాయుడు అరెస్టును ఖండించారు. ఇది జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన రాజకీయ ప్రతీకార చర్య అని అన్నారు. టీడీపీ అధిష్టానానికి తమ పార్టీ అండగా ఉంటుందని జేఎస్పీ నేత చెప్పారు. ఎయిర్ పోర్టులో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీనే అని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న పవన్‌ను అడ్డుకోవడం దారుణమన్నారు.