బియ్యపు గింజ‌పై 'జై బీఆర్ఎస్‌'.. అభిమానం చాటుకున్న స్వర్ణకారుడు

Jagtial goldsmith writes ‘Jai BRS’ with gold on rice. శుక్రవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్ణకారుడు ముప్పిడి సురేష్

By Medi Samrat  Published on  9 Dec 2022 7:30 PM IST
బియ్యపు గింజ‌పై జై బీఆర్ఎస్‌.. అభిమానం చాటుకున్న స్వర్ణకారుడు

శుక్రవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్ణకారుడు ముప్పిడి సురేష్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు బియ్యం గింజపై బంగారంతో జై బీఆర్‌ఎస్ అని రాసి.. కృతజ్ఞతలు తెలిపారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌కు చెందిన సురేష్‌.. బండలింగాపూర్‌ను మండల కేంద్రంగా ప్రకటించి స్థానిక ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చినందుకు ముఖ్యమంత్రిపై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు.

ఇటీవల జగిత్యాల పట్టణంలో పర్యటించిన చంద్రశేఖర్‌రావు కొత్త బండలింగాపూర్‌ మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విష‌య‌మై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సురేష్.. బంగారంతో బియ్యం గింజపై జై బిఆర్ఎస్ అని తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాసి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. మరోవైపు బీఆర్‌ఎస్‌ను ఆవిర్భావం సందర్భంగా కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా పటాకులు పేల్చి, మిఠాయిలు పంచుతూ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.



Next Story