జగిత్యాల అదనపు కలెక్టర్ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్‌

Jagityal Additional Collector Manda Makarandu Dance.. Video Viral. సోషల్ మీడియా వచ్చాక ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరూ ఏం పోస్టు

By అంజి
Published on : 13 Nov 2022 1:51 PM IST

జగిత్యాల అదనపు కలెక్టర్ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్‌

సోషల్ మీడియా వచ్చాక ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరూ ఏం పోస్టు చేసినా క్షణాల్లో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ జిల్లా అదనపు కలెక్టర్‌ చేసిన డ్యాన్స్‌ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జగిత్యాల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మంద మకరందు.. తన కాలేజీ రోజుల్లోనే చేసిన డ్యాన్స్‌ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన మంద మకరంద్ సివిల్స్ లో 110వ ర్యాంకు సాధించారు.

గత వారం రోజుల క్రితమే జగిత్యాల జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాలేజీల్లో చేసిన డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చదువులోనే కాదు.. డ్యాన్స్‌లోనూ అదరగొట్టారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన 'అల వైకుంఠపురములో' మూవీలోని సూపర్ హిట్ సాంగ్ బుట్ట బొమ్మ సాంగ్‌కి అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. కాలేజీ రోజుల్లో ఐఏఎస్ మకరంద్ చాలా యాక్టివ్‌గా ఉండేవారని వీడియోలను చూస్తే తెలుస్తోంది. మకరంద్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


Next Story