అలా చేస్తే కాంగ్రెస్ అభ్యర్ధిని పోటీలో నిల‌పం : జగ్గారెడ్డి

Jaggareddy Serious On Govt. రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ హామీలు ఇస్తారని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్

By Medi Samrat  Published on  4 Sep 2021 9:55 AM GMT
అలా చేస్తే కాంగ్రెస్ అభ్యర్ధిని పోటీలో నిల‌పం : జగ్గారెడ్డి

రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ హామీలు ఇస్తారని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా వర్ధ‌న్న‌పేట‌ నియోజకవర్గంలో నిర్వ‌హించిన దళిత-గిరిజన దండోరా ఆత్మ గౌరవ కార్యక్రమ ర్యాలీలో ఆయ‌న‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో 10శాతం హామీలు కూడా పూర్తి చేయలేదని అన్నారు. కేవలం హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దళిత బంధు పథ‌కం తీసుకొచ్చారని.. రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

దళితులతో పాటు గిరిజనులకు కూడా రూ. 10 లక్షలు ఇవ్వాలని.. అలాగే మైనారిటీ, బీసీ ఇతర కులాలలో ఉన్న పేదవారికి కూడా రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. వర్ధన్నపేటలో ఉన్న దళితులందరికి రూ. 10 లక్షలు ఇస్తే కాంగ్రెస్ అభ్యర్ధిని పోటీలో ఉంచ‌మని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాటంటే మాటేన‌ని అన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తామ‌ని.. ప్రతి సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తామ‌ని అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే వస్తే రూ. 10 లక్షలు ఇస్తావా.. రాజీనామా చేస్తావా అని ప్రశ్నించండని జ‌గ్గారెడ్డి సూచించారు.


Next Story
Share it