నేను ఎమ్మెల్సీ అడగడం లేదు.. అడగొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది.. పోటీ చేసిన.. పరిస్థితులు అనుకూలించక ఓడిపోయానని అన్నారు. నేను మూడు సార్లు ఎమ్మెల్యే గా ఉన్నా.. ఎమ్మెల్సీ కావాలని పడీ పడి అడిగే గుణం నాది కాదన్నారు. మీడియా మిత్రులు ఎవరు కూడా ఎమ్మెల్సీ విషయంలో ఊహాగాన వార్తలు రాయొద్దని సూచించారు.
2017లో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను స్పష్టంగా వారి దృష్టికి తీసుకెళ్లాలని గత ఆరునెలల నుండి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి చెప్పాలని అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ సభ ఆర్గనైజేషన్, ఎలాంటి పరిస్థితుల్లో సభ ఏర్పాట్లు చేశానో.. ఆ విషయాలన్నింటినీ ఆయనకు స్వయంగా చెప్పాలని ఢిల్లీకి బయలుదేరినట్లు పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కొరుతానని.. అపాయిట్మెంట్ దొరికితే వారితో మాట్లాడుతానని పేర్కొన్నారు.