మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మద్యం ధరలు తగ్గించేందుకు రాష్ట్ర సర్కార్ వద్దకు ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. లిక్కర్ ధరలను స్వల్పంగా తగ్గిస్తూ అబ్కారీశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. దీనికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. దేశీయంగా తయారయ్యే మద్యం బాటిళ్లపై స్వల్పంగా ధరలు తగ్గించాలని, దీంతో అమ్మకాలు పెరుగుతాయని అబ్కారీశాఖ భావిస్తోంది. అయితే బీరు తప్ప మిగతా మద్యం ధరలు తగ్గవచ్చు. బీరు ధరలు అలాగే కొనసాగించనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో 2,620 వైన్స్ షాపులు, వెయ్యికిపైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హెటళ్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా గత రెండేళ్ల కిందట కరోనా సెస్ పేరుతో మద్యం ధరలను 20 శాతం వరకు పెంచారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో మద్యం ధరలు తగ్గించినా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు తగ్గించలేదు. ఈ మధ్య కాలంలో బీర్లు అమ్మకం కూడా తగ్గడంతో ఒక్కో బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించింది సర్కార్. తాజాగా మద్యం ధరలపై కూడా 10 రూపాయలు తగ్గించేందుకు అధికారులు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. మద్యం ధరల తగ్గింపుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.