విద్య ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చా: మంత్రి సీతక్క

విద్య ద్వారానే తాను అభివృద్ధి చెందానని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎఫ్టీసీసీఐలో విద్యాధన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

By Knakam Karthik  Published on  29 Jan 2025 2:26 PM IST
Telangana, Minister Seetakka, Hyderabad News

విద్య ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చా: మంత్రి సీతక్క

విద్య ద్వారానే తాను అభివృద్ధి చెందానని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎఫ్టీసీసీఐలో విద్యాధన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా స్కాలర్‌షిప్‌లు పొందిన విద్యార్థులకు చెక్కులను మంత్రి సీతక్క అందజేశారు. జీవితంలో అన్నిటికంటే ఉత్తమైనది విద్య అని, దాంతోనే వికాసం సాధ్యపడుతుందని చెప్పారు. విద్యను ఎవరు దోచుకోలేరని, విద్య పంచుకుంటే జ్ఞానం పెరుగుతుందని అన్నారు. విద్యా ద్వారానే తన జీవితం ఈ స్థాయికి వచ్చిందని అన్నారు.

తాను చదువుకున్నది పదో తరగతి వరకే అయినా.. పదేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపినట్లు చెప్పారు మంత్రి సీతక్క. ఆ తర్వాత బయటికొచ్చి తిరిగి విద్యార్థిగా చదువును కొనసాగించినట్లు చెప్పారు. చదువుకోవాలన్న పట్టుదలతో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్, పీహెచ్‌డీ పూర్తి చేశానని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పటికీ విద్యను అభ్యసించడం ఆపలేదని అన్నారు. అన్ని దానాలలోకెల్లా విద్యా దానం గొప్పదని, జ్ఞానాన్ని లక్షల మందికి పంచడం ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేసిన వాళ్లమవుతామని ఈ సందర్భంగా మాట్లాడారు. విద్య, అభివృద్ధిలో నేటికీ అంతరాలు కొనసాగుతున్నాయని, ఆ అంతరాలను తొలగించే దిశలో అంతా కలసికట్టుగా పని చేయాలని ఆమె కోరారు. మారిన పరిస్థితుల్లో మానవ సంబంధాలు కూడా బలహీనపడుతున్నాయని చెప్పారు. మానవ విలువలు, సంబంధాలను పటిష్టం చేసే విద్యను ప్రోత్సహించాలని కోరారు.

Next Story