ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే అంతే సంగ‌తులు..!

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

By Kalasani Durgapraveen  Published on  10 Dec 2024 11:18 AM IST
ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే అంతే సంగ‌తులు..!

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధ్యాయుల ఫొటోలను పాఠశాలల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, డీఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు 100శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుండానే హాజరు చూపుతూ వేతనం తీసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మరికొందరైతే ఏకంగా ఏళ్ల తరబడి కూడా విధులకు హాజరుకాని ఉదంతాలు ఉన్నాయి. పాఠశాలలో ఎవరెవరు పని చేస్తున్నారో వారి ఫొటోలను పదర్శిస్తే స్పష్టత వస్తుందని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. మరోవైపు తమ వద్ద క్వాలిఫైడ్‌ టీచర్లు పని చేస్తున్నట్టు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి వివరాలు సమర్పిస్తున్నాయి. కానీ చాలా పాఠశాలలు అర్హతలు లేని వాళ్లతో పాఠాలు చెప్పిస్తున్నాయని, ప్రైవేటు స్కూళ్లలోనూ టీచర్ల ఫొటోలు ప్రదర్శించేలా నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

Next Story