మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

By అంజి  Published on  20 Nov 2024 9:08 AM IST
Interest free loans, women , Deputy CM Bhatti Vikramarka, Telangana

మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

హైదరాబాద్‌: మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏడాదిలో రూ.25 వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు నిన్న వరంగల్‌ సభలో వెల్లడించారు. ఈ రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామన్న భట్టి… ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.

''ఈ రాష్ట్ర ప్రభుత్వం మీది.. మీరు కోరుకున్న అన్నిటిని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది.. స్వేచ్ఛగా జీవించడం కోసం మనమంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రజా ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. రాష్ట్రంలోని మహిళా సంఘాలతో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించి ముందుగా వారి నుంచి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం దేశ చరిత్రలో చరిత్రాత్మకం'' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Next Story