ఇంటర్ విద్యార్థి బలవన్మరణం

Inter Student Committed For Suicide. జ్యోతి రావు పూలే కాలేజీ అధ్యాపకుల నిర్లక్ష్యం కారణంగా ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  21 Dec 2021 2:18 PM GMT
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం

జ్యోతి రావు పూలే కాలేజీ అధ్యాపకుల నిర్లక్ష్యం కారణంగా ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని కరుణాపురంలో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రభుత్వ హాస్టల్ లో పరకాల శాయంపేటకి చెందిన భరత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదే హాస్టల్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీనియర్స్ గుట్కా పాకెట్స్ తీస్కొని రమ్మని సోమవారం భరత్ పై ఒత్తిడి చేశారు. ఇక వాళ్లు చెప్పింది చేయాలని అతడు ఆ పనికి ఒప్పుకున్నాడు.

గుట్కా ప్యాకెట్స్ తీసుకువచ్చే సమయంలో వాచ్ మెన్ కి భరత్ కనిపించాడు. అతడి దగ్గర గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. దీంతో భరత్ ను ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్లారు. విషయం భరత్ తల్లి తల్లిదండ్రుల దాకా వెళ్ళిపోయింది. భరత్ కాలేజి నుండి చెప్పకుండా వెళ్ళిపోయి ఇంటికి చేరుకున్నాడు. మనస్తాపంతో పరకాల శాయంపేటలోని తమ పొలం దగ్గర గడ్డి మందు తాగి ఇంటికి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. అతని మొహం చూసిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి పరకాలలోని హాస్పిటల్ లో చేర్చగా అప్పటికే పరిస్థితి క్రిటికల్ గా మారింది. అతడిని వరంగల్ ఎంజీఎంకి తీసుకు వచ్చి చికిత్స అందిస్తుండగా మరణించాడు.


Next Story
Share it