నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
Inter Second Year Results Release Today. తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదలవనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
By Medi Samrat Published on
28 Jun 2021 3:04 AM GMT

తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదలవనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నారు.
ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నారు. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
Next Story